కార్తీక మాసం: ఎందుకు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు
అర్జున్ సమాచారం: ఉదయం: కార్తీక మాసం భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన, ఆధ్యాత్మిక శక్తితో నిండిన మాసంగా పరిగణించబడుతుంది. చాతుర్మాసంలో చివరి మాసం కావడంతో, శాస్త్రాలు దీనిని అన్ని మాసాలలోకెల్లా శ్రేష్ఠమైనదిగా వర్ణించాయి. “మాసానాం కార్తికః శ్రేష్ఠః” అనే వాక్యం కార్తీక మాసం యొక్క విశిష్టతను తెలియజేస్తుంది. నాలుగు నెలల యోగనిద్ర అనంతరం శ్రీమహావిష్ణువు మేల్కొని, తిరిగి సృష్టి నిర్వహణ బాధ్యతలను స్వీకరించే పవిత్ర కాలం ఇదే. అందువల్ల ఈ మాసంలో ఆచరించే ప్రతి ధార్మిక కార్యం విశేష ఫలితాలను అందిస్తుందని భక్తుల విశ్వాసం....