కాళేశ్వరం బ్యారేజీల పై హైకోర్టు విచారణ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
హైదరాబాద్,అర్జున్ సమాచారం: కాళేశ్వరం బ్యారేజీల అంశంపై కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం, ఎన్డీఎస్యే కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ పిల్లర్ల మరమ్మతులు చేపట్టకుండా రాజకీయాలు చేస్తున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలయిన విషయం తెలిసిందే.కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని పిటిషనర్ ఆరోపణ. రైతుల ప్రయోజనాల కోసం ఎన్డీ ఎస్ ఏ నివేదిక ప్రకారం మేడిగడ్డను పునరుద్ధరించాలని వాదన. మిగిలిన రిజర్వాయర్లపై కూడా ఎన్డీఎస్ ఏ దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, కన్నెపల్లి, సుందిళ్ల పంప్హౌస్ల...