కాశ్మీర్ పేరు ఎత్తగానే పాక్‌ ప్రధానికి గట్టిగా బుద్ధిచెప్పిన భారత్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26,అర్జున్ సమాచారం: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) 81వ సమావేశంలో జమ్మూ కాశ్మీర్‌పై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ప్రకటనపై భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది. అలాగే జమ్మూ కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ అంశంపై ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేసింది. పాకిస్తాన్ అవలంబిస్తున్న తీవ్రవాదం, మోసాలు, ద్వంద్వ వైఖరి వల్ల ఆ దేశానికి గానీ, లేదా ప్రపంచానికి గానీ ఎలాంటి ప్రయోజనం ఉండదని భారత దౌత్యవేత్త పెటల్ గెహ్లాట్ స్పష్టం చేశారు.ఐక్యరాజ్యసమితిలోని భారత...