కింగ్ నాగార్జున లాంచ్ చేసిన ‘పళ్ళ బురుసు’ మూవీ ట్రైలర్

అన్నపూర్ణ స్టూడియోస్, EPIC స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్న కుటుంబ కథా చిత్రం 'పళ్ళ బురుసు'. ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణాని నిర్మాతలు. ఉదయ్ చౌహాన్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, గోమతి, ప్రజ్వల్ యాద్మ, సుజాత కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14న సినిమా విడుదల కానుండగా, తాజాగా కింగ్ నాగార్జున అక్కినేని ఈ చిత్ర ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ట్రైలర్‌ను డిజిటల్ విడుదలకు ముందే సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చపేట గ్రామ...