హైదరాబాద్, ఆగష్టు 29,అర్జున్ సమాచారం:
కిడ్నీ మార్పిడి వైద్యంలో ఆధునిక చికిత్సా విధానాలు, మార్పిడి అనంతర సంరక్షణ, దీర్ఘకాలిక గ్రాఫ్ట్ ఆరోగ్యం, అవయవదానంపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీలో “కిడ్నీ సింపోజియం 2026” నిర్వహించబడింది. ప్రముఖ నెఫ్రాలజిస్టులు, యూరాలజిస్టులు, ట్రాన్స్‌ప్లాంట్ నిపుణులు, వైద్యులు పాల్గొని తాజా వైద్య పురోగతులు, క్లినికల్ అనుభవాలపై చర్చించారు. కార్యక్రమానికి యశోద హాస్పిటల్స్ చైర్మన్ జి. రవీందర్ రావు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్. జి. సురేందర్ రావు ప్యాట్రన్లుగా వ్యవహరించగా, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్. ఆర్. బాలసుబ్రహ్మణ్యం గౌరవ అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు కిడ్నీ మార్పిడి ఒక కొత్త జీవితానికి ఆశను కల్పిస్తుంది. ఈ రంగంలో ఆధునిక వైద్య సాంకేతికత, నిపుణులైన వైద్య బృందాల సమన్వయం మరియు మెరుగైన చికిత్సా విధానాలు అందుబాటులోకి రావడం ఎంతో అభినందనీయం అని కేంద్ర మంత్రి అన్నారు. యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీ 400కు పైగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించడం, క్లిష్టమైన కేసుల్లోనూ మంచి ఫలితాలను సాధించడం ప్రశంసనీయం. ముఖ్యంగా ABO-incompatible కిడ్నీ మార్పిడులు, వృద్ధ రోగులకు ట్రాన్స్‌ప్లాంట్లు వంటి వైద్య సేవలు మరింత మంది రోగులకు ఆశను కల్పిస్తున్నాయి.
అదేవిధంగా, అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం అత్యంత అవసరం. ఒక వ్యక్తి అవయవదానం ద్వారా మరొకరికి కొత్త జీవితాన్ని అందించగలరు. అవయవదానంపై ఉన్న అపోహలను తొలగించి, మరింత మంది ప్రజలను అవయవదానానికి ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలి. ఈ దిశగా యశోద హాస్పిటల్స్ నిర్వహించిన కిడ్నీ సింపోజియం 2026 వంటి కార్యక్రమాలు వైద్య నిపుణులు, ప్రజలు మరియు సమాజం మధ్య అవగాహనను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి అని తెలిపారు. కిడ్నీ వ్యాధుల నివారణ, సకాలంలో చికిత్స, అవయవదానం మరియు ట్రాన్స్‌ప్లాంట్ అనంతర సంరక్షణపై ప్రజల్లో అవగాహన మరింత పెరగాలని ఆకాంక్షిస్తున్నాను.” అని కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి తెలిపారు.
యశోద హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్. జి. సురేందర్ రావు, మాట్లాడుతూ: “కిడ్నీ మార్పిడి వైద్యంలో ఆధునిక సాంకేతికత, అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల సమిష్టి కృషి మరియు సమగ్ర రోగి సంరక్షణ ద్వారా మెరుగైన ఫలితాలను సాధించగలుగుతున్నాం. యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 400కు పైగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించడం మాకు ఎంతో గర్వకారణం. ABO-incompatible కిడ్నీ మార్పిడులు, వృద్ధ రోగులకు ట్రాన్స్‌ప్లాంట్లు, అలాగే వృద్ధ లివింగ్ డోనర్ల నుంచి విజయవంతమైన కిడ్నీ దానాలు వంటి క్లిష్టమైన సందర్భాల్లోనూ మంచి ఫలితాలను సాధించడం మా వైద్య బృందం నిబద్ధతకు నిదర్శనం.” అని డాక్టర్. జి. సురేందర్ రావు తెలిపారు.
యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ, నెఫ్రాలజీ విభాగం క్లినికల్ డైరెక్టర్, డాక్టర్. రాజశేఖర చక్రవర్తి మాట్లాడుతూ: “కిడ్నీ మార్పిడి అనేది కేవలం ఒక శస్త్రచికిత్సతో ముగిసే ప్రక్రియ కాదు అన్నారు. దాత–గ్రహీతల సరైన ఎంపిక, ట్రాన్స్‌ప్లాంట్‌కు ముందు సమగ్ర వైద్య మూల్యాంకనం, వివిధ వైద్య విభాగాల సమన్వయం, శస్త్రచికిత్స అనంతర నిరంతర పర్యవేక్షణ మరియు దీర్ఘకాలిక ఫాలో-అప్ అన్నీ కలిసి మంచి ఫలితాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీలో 400కు పైగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించడం మా వైద్య బృందం యొక్క సమిష్టి కృషికి నిదర్శనం అని తెలిపారు. ABO-incompatible ట్రాన్స్‌ప్లాంట్లు, వృద్ధ రోగుల్లో కిడ్నీ మార్పిడులు, అలాగే వృద్ధ లివింగ్ డోనర్ల నుంచి విజయవంతమైన కిడ్నీ దానాలు వంటి అనుభవాలు మరింత మంది రోగులకు ట్రాన్స్‌ప్లాంట్ అవకాశాలను అందించేందుకు మాకు సహాయపడ్డాయి అని తెలియజేసారు. ట్రాన్స్‌ప్లాంట్ అనంతరం కూడా రోగులు క్రమం తప్పకుండా వైద్య పర్యవేక్షణలో ఉండటం, సూచించిన మందులను సక్రమంగా తీసుకోవడం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం అత్యంత అవసరం,” అని డాక్టర్. రాజశేఖర చక్రవర్తి తెలిపారు
==================