“కిడ్నీ మార్పిడి” చికిత్సలో అత్యాధునిక వైద్య పురోగతులపై యశోద హాస్పిటల్స్‌-హైటెక్ సిటీలో “కిడ్నీ సింపోజియం 2026 ” 400కు పైగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించిన యశోద హాస్పిటల్స్ – హైటెక్ సిటీ ముఖ్య అతిధిగా పాల్గొన్న కేంద్ర బొగ్గు, గనుల శాఖా మంత్రి జి. కిషన్ రెడ్డి

హైదరాబాద్, ఆగష్టు 29,అర్జున్ సమాచారం: కిడ్నీ మార్పిడి వైద్యంలో ఆధునిక చికిత్సా విధానాలు, మార్పిడి అనంతర సంరక్షణ, దీర్ఘకాలిక గ్రాఫ్ట్ ఆరోగ్యం, అవయవదానంపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో యశోద హాస్పిటల్స్‌, హైటెక్ సిటీలో “కిడ్నీ సింపోజియం 2026” నిర్వహించబడింది. ప్రముఖ నెఫ్రాలజిస్టులు, యూరాలజిస్టులు, ట్రాన్స్‌ప్లాంట్ నిపుణులు, వైద్యులు పాల్గొని తాజా వైద్య పురోగతులు, క్లినికల్ అనుభవాలపై చర్చించారు. కార్యక్రమానికి యశోద హాస్పిటల్స్‌ చైర్మన్  జి. రవీందర్ రావు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్. జి. సురేందర్ రావు ప్యాట్రన్లుగా వ్యవహరించగా, కేంద్ర బొగ్గు, గనుల శాఖ...