కూకట్ పల్లి ట్రక్ పార్క్ వేలానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ట్రక్ పార్క్ భూముల వేలంపై దాఖలైన పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు పిటిషన్లలో ప్రజా ప్రయోజనం లేదన్న కోర్టు

హైదరాబాద్‌,అర్జున్ సమాచారం: కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలానికి తెలంగాణ హైకోర్టులో లైన్ క్లియర్ అయింది. ఈ భూముల వేలాన్ని నిలిపివేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను (పిల్స్) హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. దీంతో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ నిర్వహించ తలపెట్టిన ఈ-వేలం ప్రక్రియకు మార్గం సుగమమైంది. కూకట్‌పల్లి మండలం మూసాపేట పరిధిలోని దాదాపు 3.15 ఎకరాల ట్రక్ పార్క్ స్థలాన్ని ప్రభుత్వం వేలం వేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ భూమిని ప్రైవేటు వ్యక్తులకు లేదా సంస్థలకు విక్రయించవద్దని, ట్రక్ పార్కింగ్...