కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పీఐబీ పాత్ర కీలకం : రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా – పోషణ మాసం కార్యక్రమంకు గవర్నర్ ను ఆహ్వానించిన పీఐబీ అదనపు డైరెక్టర్ జనరల్
హైదరాబాద్, ఆగస్టు 21,అర్జున్ సమాచారం: కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పీఐబీ పాత్ర కీలకమని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. కేంద్ర పథకాలపై విస్తృత ప్రచారం చేపడుతూ ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకునేలా చూడాలని గవర్నర్ పిఐబి అధికారులకు సూచించారు. శుక్రవారం లోక్ భవన్ లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అదనపు డైరెక్టర్ జనరల్ శ్రుతి పాటిల్ ఆధ్వర్యంలో పీఐబీ జాయింట్ డైరెక్టర్ డా. మానస్ కృష్ణకాంత్ ,సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అసిస్టెంట్...