ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 8:07 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ ను కలిసిన ఎంపి ఈటల

న్యూఢిల్లీ,అర్జున్ సమాచారం:
కేంద్ర రక్షణ శాఖ మంత్రి  రాజ్ నాథ్ సింగ్ ని  మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ గురువారం కలిసారు. పలు అభివృద్ధి పనులతో పాటు తెలంగాణ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు.  సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభివృద్ధికి అదనపు నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా ఈటల రాజేందర్ కోరారు – కౌకురు దర్గా నుండి బిట్స్ పిలాని వరకు డిఫెన్స్ భూములలో రోడ్డు నిర్మాణం, విస్తరణకు అనుమతి ఇవ్వాలని కోరారు – దీనితో పాటు డిఫెన్స్ ఏరియాలో పలు రోడ్ల విస్తరణ మరియు సామాన్య ప్రజలకు అనుమతి ఇవ్వాలని కూడా కోరారు. – తాజాగా రాజనాథ్ సింగ్ గారి తెలంగాణ పర్యటన గురించి ఇరువురి మధ్య చర్చకు వచ్చింది.  బీజేపీ తెలంగాణలో పట్టు సాధించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని దీనిని అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు.  కేంద్ర నాయకత్వం సహకారం, రాష్ట్ర నాయకుల సమన్వయంతో ఈసారి తెలంగాణ గడ్డపై కషాయ జెండా ఎగురవేస్తామని ఈటల,  కేంద్ర మంత్రికి తెలిపారు.
================