కేసముద్రం మండలం అర్పణపల్లిలో పులి కలకలం

మహబూబాబాద్,అర్జున్ సమాచారం: కేసముద్రం మండలం అర్పణపల్లి గ్రామంలో  పులి సంచరించిందంటూ వస్తున్న వార్తలతో కలకలం  చోటు చేసుకుంది.  గ్రామస్తులతోపాటు, సమీప గ్రామాల ప్రజలలో కూడా భయాందోళన నెలకొంది. అర్పణపల్లి గ్రామానికి చెందిన రైతు గండికోట కుమార్ తన పొలం వద్ద పులిని ప్రత్యక్షంగా చూసినట్లు చెపుతున్నాడు. కుమార్ మాట్లాడుతూ.. సాయంత్రం పొలానికి వెళ్లినప్పుడు పొదల్లో ఏదో కదలిక కనిపించింది. దగ్గరకు వెళ్లి చూడగా పెద్దపులి ఉంది. భయంతో వెంటనే పరుగెత్తుకుని వచ్చి గ్రామంలో చెప్పాను" అని తెలిపారు. గ్రామస్తులు ఆప్రాంతంలో  పరిశీలించి చూడగా అక్కడ...