‘కేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పని చేయాలి ’ – కోర్టు డ్యూటీ అధికారుల సమీక్ష సమావేశంలో ఎస్పీ శరత్ చంద్ర
నల్లగొండ, అక్టోబర్ 31, అర్జున్ సమాచారం: కోర్టుల్లో కేసుల విచారణలో దోషులకు శిక్షలు పడే కన్విక్షన్ శాతాన్ని మరింత పెంచే దిశగా కోర్టు డ్యూటీ అధికారులు సమన్వయంతో, బాధ్యతాయుతంగా పని చేయాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కోర్టు డ్యూటీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసుల విచారణలో ఎలాంటి లోపాలకు తావులేకుండా ప్రతి కేసులో నేర నిరూపణ జరిగేలా సంబంధిత అధికారుల మధ్య సమన్వయం ఉండాలన్నారు. ప్రతి కేసులో దర్యాప్తు...