ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 13 November 2026, 7:49 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

కొండగట్టులో చందనోత్సవం –మహాసంప్రోక్షణ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్‌కు ఆహ్వానం

అర్జున్ సమాచారం:
చొప్పదండి:
జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 15వ తేదీ నుండి 20వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్న శ్రీ స్వామివారి చందనోత్సవం – మహాసంప్రోక్షణ కార్యక్రమానికి హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్  ను వికారాబాద్ క్యాంప్ కార్యాలయంలో కొండగట్టు ఆలయ అధికారులు ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఉత్సవాల ప్రత్యేక ఆహ్వాన పత్రికను స్పీకర్ కు అందజేసి, ఉత్సవాలకు విచ్చేయవలసిందిగా కోరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి  అంజనా రెడ్డి, సూపరింటెండెంట్ సునీల్ కుమార్, వేద పండితులు  రాజేశ్వర శర్మ, ఉపప్రధాన అర్చకులు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నట్లు పేర్కొన్నారు.