కొండగట్టు అంజన్నకు చందనోత్సవం.. 60 ఏళ్ల తరువాత వేడుకలు 16 నుంచి అయిదు రోజుల పాటు ప్రత్యేక పూజలు అంజన్న దర్శనం నిలిపివేత.. 21 నుంచి నిజరూపదర్శనం ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

(కరీంనగర్): అర్జున్ సమాచారం: కొండగట్టు ఆంజనేయస్వామి చందనోత్సవాలకు దేవస్థా నం ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 60 ఏళ్ల అనంతరం స్వామి వారి చందనోత్సవాన్ని వైభ వంగా నిర్వహించనున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఆంజనేయస్వామి రెండు తలలతో ఉంటారు. తూర్పువైపు నారసింహస్వామి, ఉత్తరం వైపు ఆంజ నేయస్వామిగా భక్తులకు దర్శనం ఇస్తుంటారు. విగ్రహంపై ఆరు అంగుళాల మేరకు సింధూరం: ఆంజనేయస్వామి వారికి ప్రతీ మంగళ, శనివారం ఆలయ అర్చకులు సింధూర లేపనం వేయడం ఆన వాయి తీగా వస్తోంది. 60 ఏళ్ల...