కొండగట్టు ఆంజనేయ ఆలయంలో నిర్వహించిన జ్యేష్ఠాబిషేక పూజలు

చొప్పదండి ,{మల్యాల మండలం}జూలై 6,అర్జున్ సమాచారం: జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని మాల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో జ్యేష్ఠ మాసాన్ని సందర్బంగా సోమవారం జ్యేష్ఠాభిషేక మహోత్సవ పూజలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామివారిని ప్రత్యేకంగా ఆకర్షనీయంగా అలంకరించారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణలతో పూజా ద్రవ్యాలతో పంచామృతాభిషేకం, ప్రత్యేక అర్చనలు, పూజలు నిర్వహించారు. అనంతరం 108 కలశాలతో విశేష పూజలు నిర్వహించి స్వామివారికి మహాభిషేకం చేశారు. ఈ పూజా కార్యక్రమం తిలకించేందుకు తెలంగాణ నలుమూలల...