కొండగట్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ -ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీసి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు…

జగిత్యాల,అర్జున్ సమాచారం: కొండగట్టు వద్ద కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిపై నిన్న సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు పరిశీలించారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన ఎస్పీ గారు, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, రహదారి పరిస్థితి, వాహనాల కదలిక, వాహన వేగం తదితర అంశాలపై సంబంధిత పోలీసు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను అన్ని కోణాల్లో విచారించి, సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు....