కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో గిరి ప్రదక్షిణ నిర్వహించిన మంత్రులు

జగిత్యాల,అర్జున్ సమాచారం: జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో బుధవారం మానేరుకు మంత్రి పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. అనంతరం శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతుల పొలాలు పాడిపంటలతో కళకళలాడాలని, ప్రతి రైతు సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో జీవించాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ...