‘కొరియన్ కనకరాజు’ లో స్పెషల్ సాంగ్ చేసిన హీరోయిన్ దక్షా నాగర్కర్‌

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ 'కొరియన్ కనకరాజు'తో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించింది. టైటిల్ గ్లింప్స్ , ఫస్ట్ సింగిల్ 'కంసంనిద', టీజర్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మేకర్స్ సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. 'రాసగుమ్మడి' ఫుల్ లిరికల్ సాంగ్‌ను జూలై 19న విడుదల చేయనున్నట్లు...