కోదాడలో నియోజకవర్గ కేంద్రంలో 17 కోట్ల రూపాయల తో నూతన ఆర్టీసీ బస్ స్టేషన్‌కు శంకుస్థాపన చేసిన మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి

కోదాడ,అర్జున్ సమాచారం: మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ. కోదాడ నియోజకవర్గ కేంద్రం అధునాతన హంగులతో నూతన ఆర్టీసీ బస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకొని భూమిపూజ చేసుకున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ప్రజా పాలన ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో ముఖ్యమైన ప్రాంతాల్లో ఆర్టీసీ బస్ స్టేషన్ లను నిర్మించడానికి ప్రత్యేక ప్రణాళిక ద్వారా ముందుకు పోతున్నాం. ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడగానే 48 గంటల్లో మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించాం. ఇప్పటివరకు 327 కోట్ల మంది మహిళలు జీరో...