కోర్టు డ్యూటీ అధికారుల పనితీరును మెరుగుపర్చుకోవాలి శిక్షల శాతం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలి: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
గోదావరిఖని,అర్జున్ సమాచారం: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కోర్టు డ్యూటీ,కోర్టు లైజనింగ్ పోలీసు అధికారులతో శనివారం సీపీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కోర్టు విధుల నిర్వహణ, కేసుల పురోగతి,శిక్షల శాతం పెంపు, సాంకేతిక సమస్యలు, సాక్షుల నిర్వహణ తదితర అంశాలపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ,కోర్టు విధులకు సంబంధించిన ప్రతి పనిని నిర్దేశిత గడువులో నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు.విధుల నిర్వహణలో ఎదురయ్యే పరిపాలనా...