ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 7:42 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

కౌబాయ్ అండ్ ఇండియన్” హాలీవుడ్ మూవీ త్వరలో రిలీజ్

వరుస ఆంగ్ల చిత్రాల్లో నటిస్తూ హాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నారు తెలుగు హీరో మహేశ్ శ్రీరామ్. ఆయన ప్రస్తుతం వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న “ఫణి” చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రమోషనల్ కంటెంట్ తో ఇప్పటికే “ఫణి” సినిమా మీద మూవీ లవర్స్ లో మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. మరోవైపు మహేశ్ శ్రీరామ్ హాలీవుడ్ లో నటించిన “కౌబాయ్ అండ్ ఇండియన్” సినిమా రేపు గ్రాండ్ రిలీజ్ కు రాబోతోంది. ఈ చిత్రంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు బ్రాడ్ నాప్ పోషించిన స్టీవ్ క్యారెక్టర్ కు స్నేహితుడు విజయ్ పాత్రలో మహేశ్ శ్రీరామ్ నటించారు. స్నేహితుడి అభిప్రాయాలకు విలువనిస్తూ అతని చెప్పే మాటల్ని అర్థం చేసుకుని సపోర్ట్ గా నిలిచే మిత్రుడు విజయ్ క్యారెక్టర్ లో మహేశ్ శ్రీరామ్ తన పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకోనున్నారు. డైరెక్టర్ లియో పి షెల్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
హాలీవుడ్ లో ఇలా ఎగ్జైటింగ్ మూవీస్ లో నటిస్తున్న మహేశ్ శ్రీరామ్ “ఫణి” సినిమాలో లీడ్ రోల్ చేస్తుండటం ఈ మూవీకి మరింత క్రేజ్ తీసుకొస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ డాక్టర్ వీఎన్ ఆదిత్య “ఫణి” మూవీని గ్లోబల్ ప్రాజెక్ట్ గా రూపొందిస్తున్నారు. ఈ థ్రిల్లర్ సినిమాను ఓ. ఎం. జీ ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై, ఏయు & ఐ స్టూడియో సమర్పణలో డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మిస్తున్నారు. ఫణి సినిమాలో బ్యూటిఫుల్ హీరోయిన్ కేథరీన్ ట్రెసా లీడ్ రోల్ లో నటిస్తున్నారు. త్వరలోనే హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, ఇతర ప్రపంచ భాషల్లో “ఫణి” సినిమాను విడుదల చేయబోతున్నారు.
============================