కౌశిక్ రెడ్డిపై వేటు తప్పదా

హైదరాబాద్, ఆగస్టు 31,అర్జున్ సమాచారం: ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీలో జరిగిన గొడవ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సీటుపై చర్చకు దారితీస్తోంది. కడియం శ్రీహరితో వాగ్వాదం, అనుచిత సైగలు చేశారన్న ఆరోపణలతో స్పీకర్ ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేశారు. ఎథిక్స్ కమిటీ లేకుండానే..కౌశిక్‌రెడ్డి అంశాన్ని ఎథిక్స్‌ కమిటీకి ఫార్వర్డ్‌ చేయడమేంటంటూ బీఆర్ఎస్‌ క్వశ్చన్ చేస్తూ వచ్చింది. ఎథిక్స్ కమిటీ కౌశిక్‌రెడ్డి నుంచి వివరణ తీసుకుంటుందా.? మందలింపుతో సరిపెడుతుందా? లేక కఠిన చర్యలకు సిఫారసు చేస్తుందా.? అన్నది ఉత్కంఠగా మారింది. అయితే ఎథిక్స్ కమిటీ...