క్రీడల్లో ప్రతిభ చూపిన ఆశ్రమ బాలికలు

రంపచోడవరం,అర్జున్ సమాచారం: రంపచోడవరం ఆశ్రమ ఉన్నత బాలికల పాఠశాల విద్యార్థినులు ఎస్‌జీఎఫ్‌ క్రీడా పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచారు.అండర్‌ 17 అథ్లెటిక్స్‌ సెప్టెంబర్‌ 30న జరిగిన షాట్‌పుట్‌లో పదో తరగతి విద్యార్థిని కె.సాయి మౌనిక రెండో స్థానం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికైంది.అండర్‌14 రెజ్లింగ్‌: అక్టోబర్‌ 1న జరిగిన పోటీల్లో తొమ్మిదో తరగతి విద్యార్థిని కర్రీ శివలింగేశ్వరి మొదటి స్థానం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికైంది. 30 కిలోల్లో కోట్ల ఝాన్సీరాణి, 39 కిలోల్లో సోముల యామిని తేజ, 40 కిలోల్లో బుడిమల గంగోత్రి, 42 కిలోల్లో...