ఖమ్మంలో అరుదైన తైటా గుడ్లగూబ ప్రత్యక్షం ఖమ్మం
ఖమ్మం,అర్జున్ సమాచారం: ఖమ్మం సోమారం గ్రామంలో అరుదైన తైటా గుడ్లగూబ కనిపించింది. అవుల ప్రవీణ్ ఇంటి సమీపంలో గాయాలతో కనిపించిన గుడ్లగూబ ఎగరలేకపోయింది. అటవీ అధికారులు గుడ్లగూబను గుర్తించారు. చికిత్స అనంతరం సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టేందుకు చర్యలు చేపట్టారు. ఈ గుడ్గూబను చూడడానికి స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.