ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 10 October 2026, 7:05 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఖమ్మంలో నిర్వహించిన నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.

వనపర్తి,అర్జున్ సమాచారం:
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించే ప్రక్రియను ఉద్యమంలా చేపట్టాలని, గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు కలుగుతున్న ప్రయోజనాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు. సన్నబియ్యం పంపిణీ, రైతు భరోసా, గృహజ్యోతి, ఉచిత విద్యుత్, చేయూత పింఛన్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలతో ప్రజల జీవితాల్లో వస్తున్న మార్పులను ప్రతి ఇంటికీ వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ అనుబంధం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి విజయాన్ని ప్రతి నాయకుడు, కార్యకర్త తమ బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటరు నమోదు నుంచి ఎన్నికల్లో ఓటు వేసే వరకు ప్రతి దశలోనూ అప్రమత్తంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని కోరారు.

సంక్షేమ పథకాలే కాంగ్రెస్ విజయానికి బలమని పేర్కొంటూ, పార్టీ శ్రేణుల ఐక్యత, సమష్టి కృషితో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, మట్టా రాగమయి, కోరెం కనకయ్య తదితరులు పాల్గొన్నారు