ఖమ్మంలో నిర్వహించిన నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.
వనపర్తి,అర్జున్ సమాచారం: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించే ప్రక్రియను ఉద్యమంలా చేపట్టాలని, గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు కలుగుతున్న ప్రయోజనాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు. సన్నబియ్యం పంపిణీ, రైతు భరోసా, గృహజ్యోతి, ఉచిత...