ఖమ్మం,అర్జున్ సమాచారం:
హైదరాబాద్ ట్యాంక్ బండ్ నై వినాయక నిమజ్జనాల బందోబస్తులో వున్న, ఎస్సై వెంకన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆ సంఘటన మరువక ముందే ఖమ్మం జిల్లాలో మరో ఎస్సై నిమజ్జనాల ఏర్పాట్లు చూసి వస్తున్న సమయం లో జరిగిన ఘటన లో తీవ్రంగా గాయపడ్డాడు.
తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ కూచిపూడి జగదీష్కు రోడ్డు ప్రమాదం గాయాలయ్యాయి. వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో విధులు నిర్వహించిన అనంతరం పిండిప్రోలు గ్రామం నుంచి తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్కు తిరిగి వస్తుండగా పోలీసు వాహనాన్ని లారీ ఢీకొంది. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుమలాయపాలెం ఆసుపత్రికి తరలించారు.
========================