ఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ వీసీ సజ్జనర్ హైదరాబాద్

హైదరాబాద్,అర్జున్ సమాచారం: నగరంలో వినాయక నిమజ్జనోత్సవాలు, శోభాయాత్రను అత్యంత ప్రశాంత వాతావరణంలో, వైభవంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరఫున అన్ని రకాల పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు నగర పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్ తెలిపారు. ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జన సన్నాహాలను శుక్రవారం ఆయన  ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.అంతకుముందు పోలీస్ అధికారులతో కలిసి బడా గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీపీ మీడియాతో మాట్లాడుతూ.. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనంతో పాటు, బాలాపూర్ నుంచి హుస్సేన్సాగర్ వరకు సాగే ప్రధాన...