గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడి ఆస్తుల జప్తు

భద్రాద్రి కొత్తగూడెం,అర్జున్ సమాచారం: ప్రభుత్వం నిషేధించిన గంజాయిని అక్రమంగా కొనుగోలు చేసి రవాణా చేస్తూ పట్టుబడిన నిందితుడి ఆస్తులను, అతని భార్య బ్యాంక్ ఖాతాను ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా జప్తు చేసినట్లు ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. తేదీ 28.08.2025న ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్‌లో నమోదైన Cr.No.136/2025, U/Sec 8(C) r/w 20(b)(ii)(C), 27(A), 29 of NDPS Act-1985 కేసులో నిందితుడు పల్లపు రఘు అక్రమ గంజాయి రవాణా ద్వారా సంపాదించినట్లు గుర్తించిన ఆస్తులపై ఆర్థిక దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో...