ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 7:57 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం కూలిన ఐదంతస్తుల భవనం

హైదరాబాద్, ఆగస్టు 22,అర్జున్ సమాచారం:
హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌ పరిధిలోని అంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. భవనం కూలి భారీ శబ్ధం రావడంతో

భయపడిపోయిన స్థానిక జనాలంతా అక్కడి నుంచి దూరంగా పరుగులు పెట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం జరిగింది. అంజయ్యనగర్‌లో

నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలిపోవడంతో ఓ వ్యక్తి మరణించగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది గాయపడిన వ్యక్తిని

హాస్పిటల్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. అంజయ్యనగర్‌లో నాలను అనుకుని అక్రమంగా తక్కువ స్థలంలో ఓ వ్యక్తి ఏడు అంతస్తులతో ఓ భవన నిర్మాణం చేపట్టారు. కేవలం 50 గజాల స్థలంలోనే

దాదాపు ఏడు అంతస్థుల నిర్మాణం చేపట్టారు. దీంతో భవన నిర్మాణం పూర్తి కాకుండానే అది కుప్పకూలింది. శనివారం మధ్యాహ్నం సరిగ్గా ఒంటి సమయంలో నిర్మాణంలో ఉన్న ఆ భవనం ఒక్కసారిగా

కూలిపోయింది.యజమాని అత్యాశకు పక్కనే ఉన్న నిర్మాణాలు సైతం పాక్షికంగా కూలిపోయాయి. నిర్మాణంలో ఉన్న భవనం కూలి పక్కనే వైట్ ఫీల్డ్‌ రోడ్డులో ఉన్న మరో అపార్ట్మెంట్ పై పడిపోయింది. దీంతో

ఆ భవనం సైతం దెబ్బతిన్నది. భవనం కూలినప్పుడు వచ్చి భారీ శబ్ధం విని స్థానికి జనాలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి కూడా మరణించిచగా.. రమణారెడ్డి అనే వ్యక్తి

గాయపడినట్టు సమాచారం.ఇక ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా? అని తెలుసుకునేందుకు

వాటిని తొలగిస్తున్నారు
===============