గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం కూలిన ఐదంతస్తుల భవనం
హైదరాబాద్, ఆగస్టు 22,అర్జున్ సమాచారం: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. భవనం కూలి భారీ శబ్ధం రావడంతో భయపడిపోయిన స్థానిక జనాలంతా అక్కడి నుంచి దూరంగా పరుగులు పెట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం జరిగింది. అంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలిపోవడంతో ఓ వ్యక్తి మరణించగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న...