గణనాథుల ఆశీస్సులు అందరిపై ఉండాలి కందుల సంధ్యారాణి

కమాన్ పూర్,అర్జున్ సమాచారం: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రామగుండం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల సంధ్యారాణి సందర్శించారు. మండపాల్లో కొలువుదీరిన గణనాథులను దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, భక్తులతో కలిసి గణపతి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రామగుండం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని గణనాథుని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం 8వ కాలనీలోని ఓసిపి 3 బేస్ వర్క్ షాప్...