గణేష్ ఉత్సవాలు, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి గణేష్ మండపాలను సందర్శించిన ఖని ఏసీపీ
అర్జున్ సమాచారం: గోదావరిఖని: గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ మండపాలను గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్, ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రామగుండం సీఐ కృష్ణకుమార్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ నిర్వాహకులతో మాట్లాడి, ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. అనంతరం ఏసీపీ ఎం.రమేష్ మాట్లాడుతూ, 23-09-2026 బుధవారం నిర్వహించనున్న గణేష్ నిమజ్జన శోభాయాత్రలో నిర్వాహకులు పోలీసుల సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిర్వాహకులకు ముఖ్య సూచనలు నిమజ్జన శోభాయాత్రలో పోలీసులు సూచించిన మార్గం,...