గ‌ణేష్ నిమ‌జ్జ‌నం సేవ‌ల్లో హైడ్రా ప‌హారాలో 234 మంది హైడ్రా స్విమ్మ‌ర్లు వీరికి తోడు 51 డీఆర్ఎఫ్ బృందాలు

హైద‌రాబాద్‌, సెప్టెంబ‌రు 24: అర్జున్ సమాచారం: భక్తిశ్రద్ధలతో పూజలనంత‌రం గణనాథుడి నిమజ్జన కార్యక్రమానికి న‌గ‌ర ప్ర‌జ‌లు సిద్ధ‌మౌతున్నారు. ఇప్ప‌టికే కొన్ని విగ్ర‌హాలు నిమ‌జ్జ‌నం పూర్తి చేయ‌గా.. శుక్ర‌వారం ప్ర‌ధాన నిమ‌జ్జ‌న ఘ‌ట్టం ప్రారంభం కానుంది. భక్తుల ఆధ్యాత్మిక ఉత్సాహానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా హైడ్రా ఏర్పాట్లు చేసింది. కూక‌ట్ ప‌ల్లి ఐడీఎల్ చెరువు అభివృద్ధి ప‌నులు పూర్త‌వ్వ‌న‌ప్ప‌టికీ.. గ‌ణేష్ నిమ‌జ్జ‌నానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా.. ఏకంగా 25 అడుగుల మేర చెరువును త‌వ్వి నిమ‌జ్జ‌నాలు సాఫీగా సాగేలా ఏర్పాట్లు చేసింది హైడ్రా.  ఈ ఏర్పాట్లు...