హైదరాబాద్,అర్జున్ సమాచారం:
శుక్రవారం నాడు గణేష్ నిమజ్జనాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. నిమజ్జన ఘాట్ వద్ద ఖైరతాబాద్ మహాగణపతికి ప్రత్యేక పూజలు చేసారు. నిమజ్జనానికి ముందు జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తో పాటు అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య రు కూడా ప్రత్యేక నిమజ్జన పూజల్లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ మార్గంలోని హైడ్రా కంట్రోల్ రూమ్ వేదిక నుంచి నిమజ్జనాన్ని అయన పరిశీలించారు.
తరువాత హైడ్రా బోట్స్ పహారాను పరిశీలించారు. నిమజ్జనం పూర్తయ్యేవరకు అన్ని శాఖలతో హైడ్రా అధికారులు, సిబ్బంది సమన్వయంగా పని చేయాలని సూచించారు. అయనతో పాటు ఆర్ఎఫ్ వో జయప్రకాష్చ ఎస్ఎఫ్ వో చంద్రశేఖర్ బాబు ఉన్నారు.
=======================