గత ప్రభుత్వానికి నరకడం తప్ప… నాటే ఆలోచనే రాలేదు కూటమిది నరికే సంస్కృతి కాదు… నాటే సంస్కృతి భూమాతను కాపాడుకోవడం మనందరి బాధ్యత ప్రకృతి, ఆధ్యాత్మికతల అద్భుత సమ్మేళనం “అశ్వత్థ నారాయణ వివాహం” అరణ్యారామంలో రావి–వేప మొక్కలు నాటిన నాగబాబు దంపతులు ప్రకృతి సంరక్షణలో భారత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలవాలి రావి, వేప మొక్కలు నాటిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కొణిదెల నాగబాబు
అర్జున్ సమాచారం: హరిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా ప్రతి ఒక్కరూ పచ్చదనం పెంపునకు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి, వాటి సంరక్షణకు కృషి చేయాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కొణిదెల నాగబాబు పిలుపునిచ్చారు. శనివారం మంగళగిరిలోని అరణ్యారామం నందవనంలో సాంప్రదాయ రావి–వేప మొక్కల నాటే కార్యక్రమంలో నాగబాబు , సతీమణి శ్రీపద్మజ కలిసి పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నాగబాబు దంపతులు రావి–వేప మొక్కలను నాటారు. ఈ సందర్భంగా నాగబాబు గారు మాట్లాడుతూ “భూమాత మనకు...