గాంధీ బాటలో వికసిత భారత్.. బాపూజీ ఆశయాలపై మోదీ కీలక సందేశం గాంధీజీకి ప్రధాని మోదీ నివాళులు బాపూజీ ఆశయాలు మెరుగైన సమాజ నిర్మాణానికి దిక్సూచి అని వ్యాఖ్య గాంధీ సిద్ధాంతాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్న మోదీ గాంధీ జయంతి రోజున ఖాదీ ఉత్పత్తులు కొనాలని పిలుపు లాల్ బహదూర్ శాస్త్రికీ నివాళులర్పించిన మోదీ
న్యూఢిల్లీ,అర్జున్ సమాచారం: జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలు ఎప్పటికీ మానవాళికి మార్గదర్శకంగా నిలుస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సత్యం, అహింస, నిరాడంబరత, స్వదేశీ భావనలతో కూడిన బాపూజీ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. గాంధీజీ చూపిన బాటలో నడుస్తూ మెరుగైన సమాజంతో పాటు వికసిత భారత్ నిర్మాణం దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం మహాత్ముడికి నివాళులర్పించిన మోదీ.. ఆయన సందేశాలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ‘ఎక్స్’ వేదికగా స్పందించిన ప్రధాని.. బాపూజీ శాశ్వత సందేశం మెరుగైన సమాజం,...