గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల్లో డీడీ జాదవ్ అంబాజీ ఆకస్మిక తనిఖీ

ఆసిఫాబాద్  సెప్టెంబర్ 30:అర్జున్ సమాచారం: కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం లోని బాలికల గురుకుల పాఠశాల,కళాశాల లను జిల్లా గిరిజన సంక్షేమ ఉప సంచాలకులు జాదవ్ అంబాజీ బుధువారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థినిల హాజరు, తరగతి గదుల్లో బోధన, వసతి గృహ నిర్వహణ, భోజనశాల, వంటశాల, పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణ, వైద్య సదుపాయాలు, విద్యార్థుల భద్రతా చర్యలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థినిలతో నేరుగా మాట్లాడి వారి విద్యాభ్యాసం, భోజనం నాణ్యత, వసతి...