గుడుంబా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు నర్సింహులపేట:

నర్సింహులపేట:అర్జున్ సమాచారం: గుడుంబా తయారీ, విక్రయాలపై నర్సింహులపేట పోలీసులు కొరడా ఝుళిపించారు. కమ్యూనిటీ అవుట్‌రీచ్‌ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం గోపా తండా గ్రామపంచాయతీ పరిధిలోని చింతల తండా, అమిరియా తండా, కొత్త తండాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గుడుంబా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 2 వేల లీటర్ల బెల్లం వాష్‌ను పోలీసులు ధ్వంసం చేశారు. అలాగే 3 క్వింటాళ్ల నల్ల బెల్లం, 40 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 15 మంది వ్యక్తుల వద్ద ఈ పదార్థాలను...