ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 7:13 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రెండు జింకలు మృతి

చిట్వేలి,అర్జున్ సమాచారం:
పుల్లంపేట మండలంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని రెండు జింకలు మృతి చెందాయి. పుల్లంపేట మండలం అనంతసముద్రం సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో రెండు జింకలు మృతి చెందాయి.  సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన జింకలను పరిశీలించి, ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. జింకలను ఢీకొన్న వాహనం ఆచూకీ కోసం అధికారులు చర్యలు చేపట్టారు. అటవీశాఖ అధికారులు మృతి చెందిన జింకలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించారు.
==========================