గూడూరు స్వామిరెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలి… -హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల ధర్నా… -తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత.. -జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై కేసును తక్షణమే విత్ డ్రా చేసుకోవాలి…

హుజూరాబాద్,అర్జున్ సమాచారం: జర్నలిస్టుల నివేశన స్థలాలపై వేసిన కోర్టు కేసును ఉపసంహరించుకోకుండా తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ నాయకుడు గూడూరు స్వామిరెడ్డిని వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని హుజూరాబాద్ ప్రెస్ క్లబ్, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట గంటపాటు నిరసన ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ జక్కని నరేందర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కాయిత రాములు, కార్యదర్శి కామని రవీందర్...