గొడ్డలి పార్టీ చేసే కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి యూనిట్ ఇంఛార్జ్‌లకు శిక్షణలో సీఎం చంద్ర‌బాబు

తాడేప‌ల్లి,అర్జున్ సమాచారం : టీడీపీ కేంద్ర కార్యాలయంలో యూనిట్ ఇంఛార్జ్‌లకు శిక్షణా తరగతులకు  ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరై ప్రభుత్వ పథకాలు, పార్టీ కార్యక్రమాలపై దిశానిర్ధేశం చేసారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ   కార్యకర్తల్లో నాయకత్వం పెంపొందించడానికే శిక్షణ ఇస్తున్నాం. పార్టీ భావజలాన్ని అర్థం చేసుకోవాలి... ప్రభుత్వం చేసే మంచిని ప్రజలకు వివరించాలి. ప్రభుత్వం చేసిన మంచిని చెప్పుకోకుంటే తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మే ప్రమాదం ఉంటుంది. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. గొడ్డలి పార్టీ చేసే కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని అన్నారు....