గోనెగండ్ల వీధికుక్కల దాడి ఘటనపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం

గోనెగండ్ల,అర్జున్ సమాచారం: గోనెగండ్ల పట్టణంలో ఒక చిన్నారిపై వీధికుక్క దాడి చేసి గాయపరిచిన ఘటనపై ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే క్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి తక్షణమే స్పందించారు. ఘటన వివరాలు తెలిసిన వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పట్టణంలోని నివాస ప్రాంతాలు, ప్రధాన వీధులు, బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తున్న ప్రమాదకరమైన వీధికుక్కలను గుర్తించి, వాటిని పట్టుకుని తరలించేలా వెంటనే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సంబంధిత శాఖ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. భవిష్యత్తులో...