కమాన్ పూర్,అర్జున్ సమాచారం:
కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన గుండారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న నల్లవెల్లి ఆనంది బంగారు పతకం సాధించారు.
హనుమకొండ జేఎన్ఎం స్టేడియంలో 12 తెలంగాణ స్టేట్ మీట్ సౌత్ జోన్ ఆథెనెటిక్ ఛాంపియన్షిప్ 18 ఇయర్స్ విభాగంలో 400 మరియు 200 మీటర్స్ రాష్ట్రస్థాయి గోల్డ్ మెడల్ సాధించి సెప్టెంబర్ నెల పాండిచేరిలో జరిగే సౌత్ జోన్ నేషనల్ మీట్ కు నల్లవెల్లి ఆనంది ఎంపికైంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి సారంగపాణి ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేశ్వర్ రెడ్డి కోచ్ సుబ్బారావుఆనందిని అభినందించినారు. ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు
లైన్స్ క్లబ్ చైర్మన్ సాన రామకృష్ణారెడ్డి, లైన్స్ క్లబ్ సభ్యుడు లయన్ జబ్బార్ ఖాన్, బండ సాయి శంకర్ లు శుభాకాంక్షలు తెలియజేశారు.
=======================