గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరం పాటుపడదాం. గ్రామ సర్పంచ్ రేండ్ల శారద
కమాన్ పూర్,అర్జున్ సమాచారం: . కల్వచర్ల గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరం పాటు పడదామని గ్రామ సర్పంచ్ రేండ్ల శారద కుమారస్వామి అన్నారు. శనివారం రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గ్రామసభ నిర్వహించారు. రామగిరి మండలం కల్వచర్ల గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గ్రామసభను ఘనంగా నిర్వహించారు. ఈ గ్రామసభకు సర్పంచ్ రేండ్ల శారదకుమారస్వామి అధ్యక్షత వహించారు. గ్రామ అభివృద్ధికి సంబంధించిన తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, విద్య, ఆరోగ్యం...