కమాన్ పూర్,అర్జున్ సమాచారం:
శ్రీ దుర్గా నవరాత్రి ఉత్సవాలు, విజయదశమి దసరా పండుగను పురస్కరించుకొని సింగరేణి ఆర్ జి-3 ఓసీ1 గనిలోని ఉద్యోగులందరూ బాగుండాలని, గనిలో ఎలాంటి ప్రమాదం జరగకుండా, అన్ని పనులు సక్రమంగా జరుగుతూ అధిక ఉత్పత్తి సాధించి, సింగరేణిలో అత్యున్నత పేరు సాధించాలని కోరుకుంటూ గని మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆనవాయితీ ప్రకారం గని మేనేజర్ రావుల పాపయ్య , ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన శమీ పూజ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి కేంద్ర కార్యదర్శి గడ్డం తిరుపతి – భాగ్యలక్ష్మి దంపతులు పాల్గొన్నారు.
జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజ నిర్వహించి, ఉద్యోగులతో కలిసి జమ్మి ఆకును పంచుకుంటూ ఒకరికొకరు దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ సందర్భంగా మైసమ్మ తల్లి కృపతో గనిలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ సకల ఆయురారోగ్యాలతో ప్రమాదరహిత ఉత్పత్తిని సాధించి, గనికి మంచి పేరు రావాలని వేడుకున్నారు.