ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు.

జయశంకర్ భూపాలపల్లి.అర్జున్ సమాచారం: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్ ఆవరణలో గురువారం నిర్వహించిన వేడుకల్లో బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ నిరంజన్‌, ఎమ్మెల్యే సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి సిరిశెట్టి సంకీర్త్ పాల్గొన్నారు. ఐడిఓసి కార్యాలయానికి చేరుకున్న చైర్మన్ కు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి సంకీర్త్ పుష్ప గుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ మాట్లాడుతూ నిరంజన్‌ నిజాం...