ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 7:05 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జైలులో రోడ్డు ప్రమాదం కేసులో ఖైదీగా ఉన్న కంది సాగర్(31) అనే వ్యక్తిని  అధికారులు ఇటీవల చంచల్గూడ జైలుకు తరలించారు. బెయిల్ ఇచ్చేందుకు భార్య ముందుకు రాకపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. తనకు బెయిల్ వచ్చేలా ప్రయత్నించాలని కోరినా భార్య నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, జైలు వాష్రూమ్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, మార్గమధ్యంలో పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు.
=====================