చందానగర్‌లో గంజాయి స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్
కొండాపూర్, సెప్టెంబర్ 30 :అర్జున్ సమాచారం: గంజాయి అక్రమ రవాణా, విక్రయానికి పాల్పడుతున్న ఇద్దరిని చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1.5 కిలోల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో చందానగర్ రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయగా, గమనించిన నిందితులు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో విశాఖపట్నానికి చెందిన మెరిపాటి మనోజ్‌కుమార్ (22), విజయనగరం జిల్లాకు చెందిన ఎం ఆశాజ్యోతి (23)లుగా గుర్తించారు....