చర్చలు విఫలం… ఐదు రోజులు బ్యాంకులు బంద్! సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల సమ్మె

న్యూఢిల్లీ,అర్జున్ సమాచారం: దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడనుంది. బ్యాంకు యూనియన్లు, ప్రభుత్వ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఫలితంగా సెప్టెంబర్ చివరి వారంలో వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. వారానికి ఐదు రోజుల పనిదినాలు, ఇతర పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ బ్యాంకు సంఘాలు కొంతకాలంగా నిరసనలు తెలుపుతున్నాయి. ఈ క్రమంలో ఆర్థిక శాఖ సూచన మేరకు మంగళవారం డిప్యూటీ లేబర్ కమిషనర్తో...