చిన్నారులు భావోద్వేగాలకు గురైనప్పుడు వెంటనే ఫోన్ ఇస్తున్నారా.. ఇకపై అలా చేయకండి.. ఎందుకంటే..?
చిన్నారులు ఏడ్చినప్పుడు లేదా కోపంగా, అసహనంగా ఉన్నప్పుడు వారిని శాంతింపజేయడానికి చాలామంది తల్లిదండ్రులు వెంటనే సెల్ఫోన్ లేదా ఇతర తెరలు ఉన్న పరికరాలను చేతిలో పెడుతున్నారు. ఇది తాత్కాలికంగా మంచి పరిష్కారంలా కనిపించినప్పటికీ, పిల్లల మెదడు అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లల భావోద్వేగాలను అర్థం చేసుకుని వాటిని నియంత్రించుకోవడం నేర్పించకుండా, ఫోన్ ద్వారా తాత్కాలికంగా శాంతింపజేసే ఈ విధానాన్నే డిజిటల్ పసిఫైయర్ గా పిలుస్తున్నారు. అంటే పిల్లలు తమ భావాలను తామే అధిగమించడం నేర్చుకునే బదులు, బయట...